డైరీ టెక్నాలజీ కళాశాలను సందర్శించిన కౌన్సిలర్ హర్షిత..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 04: కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఉన్న డైరీ టెక్నాలజీ కళాశాలను స్థానిక వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత సందర్శించారు. ఈ సందర్భంగా దొడ్ల డైరీ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద సుమారు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కళాశాల మొదటి అంతస్తు భవన నిర్మాణ పనులను పరిశీలించారు.అనంతరం కళాశాలలోని ఇంజనీరింగ్ విభాగం, డైరీ ల్యాబ్‌లను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వారి విద్యాభ్యాసం, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై ఆరా తీశారు....