NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 10:23 am Posted by : MEDUDHULA KASHAGOUD

డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల ఉక్కుపాదం 38 మందికి జరిమానా ఐదుగురికి జైలు శిక్ష

(నమస్తే ఇందూర్) కామారెడ్డి క్రైమ్ జులై 23:

కామారెడ్డి జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసులు నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 38 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.కేసులను విచారించిన న్యాయమూర్తి నిందితులకు మొత్తం రూ.43,500 జరిమానా విధించారు. అలాగే మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడిపిన తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన ఐదుగురికి ఒక రోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్‌కు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి, మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని, పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.