డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల ఉక్కుపాదం 38 మందికి జరిమానా ఐదుగురికి జైలు శిక్ష
(నమస్తే ఇందూర్) కామారెడ్డి క్రైమ్ జులై 23: కామారెడ్డి జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసులు నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 38 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.కేసులను విచారించిన న్యాయమూర్తి నిందితులకు మొత్తం రూ.43,500 జరిమానా విధించారు. అలాగే మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడిపిన తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన ఐదుగురికి ఒక రోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం....