NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 9:55 pm Posted by : MEDUDHULA KASHAGOUD

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై దేవునిపల్లి పోలీసుల ప్రత్యేక డ్రైవ్..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 05:

కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్రియల్ జంక్షన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురిని గుర్తించి, వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఇది తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ, మద్యం సేవించిన అనంతరం వాహనాలు నడపవద్దని పోలీసులు సూచించారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.