థలసేమియా బాధితులకు ప్రతి రక్తదానం కొత్త జీవితాన్ని అందిస్తుంది జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 04: రక్తదానం అత్యున్నత మానవతా సేవ అని, ఒక వ్యక్తి ఇచ్చే రక్తం మరొకరికి ప్రాణదానంగా మారుతుందని జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో సౌత్ క్యాంపస్, బిక్కనూర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ థలసేమియా బాధితులు, ప్రమాదాల్లో గాయపడిన వారు,...