దాబాలో అక్రమ మద్యం విక్రయాలు.. యజమానికి రూ.15 వేల జరిమానా – రూ.1 లక్షకు మళ్లీ బైండోవర్..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా, పిట్లం, జూలై 10: కామారెడ్డి జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, దాబాల్లో సిట్టింగుల నిర్వహణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో పిట్లం మండలంలోని దుర్గ భవాని (సంతు) దాబాలో బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన యజమానిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.పిట్లం గ్రామ శివారులో ఉన్న దుర్గ భవాని (సంతు) దాబా యజమాని రాథోడ్ సంతోష్ (తండ్రి నాగ్‌నాథ్) గతంలో అనుమతి లేకుండా మద్యం విక్రయాలు, సిట్టింగులు నిర్వహించరాదని హెచ్చరిస్తూ 2025 ఆగస్టు 30న పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు...