NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 11:10 am Posted by : Rayala Polaiah

నూతనంగా బాధ్యతలు చేపట్టిన తాసిల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు.

 

నమస్తే ఇందూర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జులై 21

దమ్మపేట మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ ని దమ్మపేట గ్రామ సర్పంచ్ పగడాల రమాదేవి , రాంబాబు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండల ప్రజలకు పారదర్శకంగా, ప్రజాహిత దృక్పథంతో ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. దమ్మపేట మండల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంలో తహసీల్దార్ సమర్థవంతంగా పనిచేసి ప్రజల ఆదరణ పొందాలని కోరారు

నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణిస్తూ, ప్రజలకు మరింత చేరువై మండల అభివృద్ధికి విశేష కృషి చేయాలని ఆకాంక్షిస్తూ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.