NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 4:07 pm Posted by : MEDUDHULA KASHAGOUD

నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులకు ఎస్పీ అభినందనలు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 18:

కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో నూతన బాధ్యతలు స్వీకరించిన పలువురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ అభినందించారు. బిక్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా ఎస్. అనిల్, రాజంపేట ఎస్‌హెచ్‌వోగా డి. ఆంజనేయులు, మాచారెడ్డి ఎస్‌హెచ్‌వోగా కె. విజయ్, బీబీపేట ఎస్‌హెచ్‌వోగా నవీన్ చంద్ర, బాన్సువాడ పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా శిరీష బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రతి అధికారి ప్రజల పట్ల బాధ్యతాయుతంగా, పారదర్శకంగా వ్యవహరిస్తూ నాణ్యమైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని మర్యాదపూర్వకంగా స్వాగతించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెంపొందించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేయాలని, అదే సమయంలో నేరాల నియంత్రణలో ఎలాంటి రాజీ పడకుండా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని ఆదేశించారు.క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం, పారదర్శకతతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, ప్రజా భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ సమర్థవంతంగా సేవలందించాలని ఎస్పీ సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు తమపై ఉంచిన నమ్మకానికి జిల్లా ఎస్పీతో పాటు ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు పూర్తి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.