నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులకు ఎస్పీ అభినందనలు
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 18: కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో నూతన బాధ్యతలు స్వీకరించిన పలువురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ అభినందించారు. బిక్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా ఎస్. అనిల్, రాజంపేట ఎస్‌హెచ్‌వోగా డి. ఆంజనేయులు, మాచారెడ్డి ఎస్‌హెచ్‌వోగా కె. విజయ్, బీబీపేట ఎస్‌హెచ్‌వోగా నవీన్ చంద్ర, బాన్సువాడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా శిరీష బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,...