NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 10:17 am Posted by : MEDUDHULA KASHAGOUD

పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ..

పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ..

-ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నాయకులు, కార్యకర్తల పాల్గొనడం

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా జుక్కల్ జూలై 07:

జుక్కల్ మండల కేంద్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా నిర్వహించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జుక్కల్ మండల అధ్యక్షుడు ఆయిల్‌వార్ మారుతి మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా మాదిగల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం పోరాటం చేస్తూ అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన మహోన్నత ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారం మాదిగ సమాజానికే కాకుండా అన్ని అణగారిన వర్గాలకు గర్వకారణమని పేర్కొన్నారు.మందకృష్ణ మాదిగకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మరెన్నో విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ, సమాజ సేవలో మరింత కాలం ప్రజలకు మార్గదర్శకులుగా కొనసాగాలని కోరారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు ఎస్. బాలాజీ, ప్రధాన కార్యదర్శి ఇబిత్వార్ సూర్యకాంత్, కార్యదర్శి కోటగిరి సాయిలు, మనోహర్, కొండయ్య, అజయ్‌తో పాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.