ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డ్యుయల్ డెస్కుల పంపిణీ

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 13: కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆధ్వర్యంలో, ఆయన తండ్రి కె.పీ. రాజారెడ్డి స్మారకార్థం ఏర్పాటు చేసిన కె.పీ. రాజారెడ్డి జనసేవా ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డ్యుయల్ డెస్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని 35వ వార్డు కాకతీయ నగర్ (దేవునిపల్లి) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వినియోగార్థం 30 డ్యుయల్ డెస్కులను అందజేశారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో...