ప్రీవెంటివ్ పోలీసింగ్ వైపు కామారెడ్డి పోలీసుల అడుగులు
-ఆపరేషన్ కవచ్' ద్వారా నిరూపణ, విజయవంతంగా ఏడాది పూర్తి -ప్రజలకు రక్షణ కవచంలా కొండంత ధైర్యంలా -కామారెడ్డి పోలీసుల ఏడాది ఆదర్శ ప్రస్థానం -జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ దిశానిర్దేశంలో ‘ఆపరేషన్ కవచ్’ విజయవంతంగా ఏడాది పూర్తి. (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 30: కామారెడ్డి పోలీసుల అచంచల విశ్వాస ప్రస్థానం. రాత్రి వేళల్లో జగమంతా నిశ్శబ్దంగా నిద్రకు ఉపక్రమిస్తుంది. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించిన సామాన్యుడు హాయిగా కనుమూసేవేళ అది. కానీ, అదే సమయంలో నల్లని చీకట్లను...