- (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బీబీపేట్, జూలై 18:
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన జోగిపేట సిద్దవ్వ ఇటీవల మరణించగా, ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న 12వ వార్డ్ సభ్యుడు పందిరి శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ శనివారం 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా వారికి ధైర్యం కల్పించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో 12వ వార్డ్ సభ్యుడు పందిరి శ్రీకాంత్ రెడ్డి, శివనూరి నర్సింలు, రొడ్డ బాబు లావణ్య, గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రొడ్డ రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతర్ల రాజిరెడ్డి, నవీన్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.