బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బీబీపేట్, జూలై 18: కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన జోగిపేట సిద్దవ్వ ఇటీవల మరణించగా, ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న 12వ వార్డ్ సభ్యుడు పందిరి శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ శనివారం 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా...