NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:20 am Posted by : MEDUDHULA KASHAGOUD

బీబీపేట పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌ఐగా నవీన్ చంద్ర బాధ్యతల స్వీకరణ

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బీబీపేట, జూలై 18:

కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా నవీన్ చంద్ర శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ సిబ్బందితో సమావేశమై పోలీసింగ్ విధానాలపై చర్చించారు. అనంతరం ఎస్‌ఐ నవీన్ చంద్ర మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పారదర్శక, ప్రజామిత్ర పోలీసింగ్‌ను అమలు చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నేరాల నియంత్రణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, ట్రాఫిక్ క్రమశిక్షణ పెంపొందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఏవైనా ఫిర్యాదులు లేదా సమస్యలు ఉన్నా నిర్భయంగా బీబీపేట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. పోలీసు శాఖకు ప్రజలు సహకరిస్తే నేరాల నియంత్రణతో పాటు సమాజంలో శాంతి, భద్రతలను మరింత సమర్థవంతంగా కాపాడగలమని ఆయన అన్నారు.బీబీపేట మండల ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని నూతన ఎస్‌ఐ నవీన్ చంద్ర ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.