బీబీపేట పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌ఐగా నవీన్ చంద్ర బాధ్యతల స్వీకరణ

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బీబీపేట, జూలై 18: కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా నవీన్ చంద్ర శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ సిబ్బందితో సమావేశమై పోలీసింగ్ విధానాలపై చర్చించారు. అనంతరం ఎస్‌ఐ నవీన్ చంద్ర మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పారదర్శక, ప్రజామిత్ర పోలీసింగ్‌ను అమలు చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నేరాల నియంత్రణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత, సైబర్...