భారీ వర్షాలకు నేలమట్టమైన ఇల్లు
-బాధిత కుటుంబానికి గ్రామ పెద్దల పరామర్శ (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ జూలై 31: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ పాత ఇల్లు కూలిపోవడంతో బాధిత కుటుంబానికి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న గ్రామ పెద్దలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు...