మండల కార్యాలయంలో సమీక్ష సమావేశం
-బోర్‌వెల్ రీఛార్జ్, ఫామ్‌పాండ్‌లు, ఇంకుడు గుంతలు, సీజనల్ వ్యాధుల నివారణపై అధికారులకు ఆదేశాలు (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయి జూలై 25: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కార్యాలయంలో శుక్రవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు, పారిశుధ్యం, వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సమావేశంలో ప్రతి గ్రామపంచాయతీలో బోర్‌వెల్ రీఛార్జ్ పనులను వెంటనే ప్రారంభించాలని, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే ఫామ్‌పాండ్‌ల...