NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 1:37 pm Posted by : Rayala Polaiah

మణుగూరుప్రధాన రహదారిపై గుంతలను పూడ్చాలి

మణుగూరు ప్రధాన రహదారిపై భారీ గుంతలు వెంటనే పూడ్చాలి

నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలై 13

జిల్లా కలెక్టర్‌కు మాజీ జడ్పీటీసీ పాల్వంచ దుర్గ వినతి

మణుగూరు: మణుగూరు పట్టణ ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలను అత్యవసరంగా పూడ్చడంతో పాటు శాశ్వతంగా నాణ్యమైన బీటీ (BT) రహదారి నిర్మాణం చేపట్టాలని మాజీ జడ్పీటీసీ పాల్వంచ దుర్గ జిల్లా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మణుగూరు ప్రధాన రహదారిలో సురక్ష బస్ స్టాండ్ సమీపంలోని గిరిజన స్టోర్ ఎదురుగా, అంబేద్కర్ సెంటర్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో, అశోక్‌నగర్ పెట్రోల్ బంక్ ముందు రహ దారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో వాటి లోతు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రహదారి పట్టణంలో అత్యం త రద్దీగా ఉండే ప్రధాన మార్గమని, ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు, విద్యా ర్థులు, ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, అత్యవసర సేవల వాహనాలు, ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనా లు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయని తెలిపారు. గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోవ డం, ఆటోలు, కార్లు ఇతర వాహనాలు ప్రమాదాలకు గురవడం తరచుగా జరుగు తోందన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల తీవ్రత మరింత పెరుగుతోంద ని పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు గాయపడగా, భవిష్యత్తులో ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉన్నందున సంబం ధిత అధికారులు వెంటనే స్పందించాలని ఆమె కోరారు. భారీ గుంతలను అత్యవ సరంగా పూడ్చి వేయడంతో పాటు శాశ్వత పరిష్కారంగా నాణ్యమైన బీటీ రహదారి నిర్మించాలని, మరమ్మతులు పూర్తయ్యే వరకు హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో వెంటనే పరిశీలించి నివేదిక సమర్పించే లా ఆదేశాలు జారీ చేయాలని, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ను దుర్గ కోరారు.