మద్యం మత్తులో డ్రైవింగ్‌కు చెక్.. 51 మందికి కోర్టు శిక్షలు..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 10: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 51 మందిని గుర్తించి సంబంధిత న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు మొత్తం రూ.62,000 జరిమానా విధించడంతో పాటు 13 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం...