మున్నూరు కాపు నేత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య పటేల్

-త్వరలో జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడి (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 18: మున్నూరు కాపు ఎల్లారెడ్డి నియోజకవర్గ కో-కన్వీనర్ కట్లకుంట్ల సుధాకర్ తల్లి మృతిపై తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ఆయన సుధాకర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దేవయ్య పటేల్ మాట్లాడుతూ, మున్నూరు కాపు సంఘం బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో త్వరలోనే...