లింగంపల్లి ఖుర్ద్ హై లెవల్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రూ.4 కోట్లు
-ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా పనుల ప్రారంభం (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి జూలై 23 : గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపల్లి ఖుర్ద్ హై లెవల్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గురువారం ప్రారంభించారు. వరదల వల్ల బ్రిడ్జి దెబ్బతినడంతో లింగంపల్లి ఖుర్ద్తో పాటు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు,...