విద్యాశాఖ అధికారిపై తీవ్ర ఆరోపణలు తహసీల్దార్‌కు ఫిర్యాదు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బీర్కూర్, జూలై 21: బీర్కూర్ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)పై బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గైని సంపత్ తీవ్ర ఆరోపణలు చేస్తూ మంగళవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, బీర్కూర్ మండల పరిధిలోని జడ్పీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి వివిధ అవసరాల పేరుతో అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు....