NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 4:23 pm Posted by : MEDUDHULA KASHAGOUD

శబ్దిపూర్ ఎడమ తండాలో ఘనంగా శీతల పండుగ వేడుకలు..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 07:

కామారెడ్డి మండలం శబ్దిపూర్ గ్రామంలోని ఎడమ తండాలో శీతల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని ఆరాధించారు. గ్రామంలో సుఖశాంతులు, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మలత్ గోపాల్, బి. కరబారి గంగారం నాయక్, గుడి పూజారి లాల్నాయక్, గుడి చైర్మన్ మెగావత్ సేవియా, సర్పంచ్ మలవత్ సీతారాం నాయక్, ఉప సర్పంచ్ రవీందర్ నాయక్, మనసింగ్, రమేష్, వసత్ వాడు, గ్రామ పంచాయతీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.శీతల పండుగ సందర్భంగా తండా ప్రజలు సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని గ్రామ ఐక్యతను చాటారు.