NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 4:57 pm Posted by : Rayala Polaiah

శివాలయం ప్రధాన పూజారికి డాక్టరేట్

శివాలయం ప్రధాన పూజారికి డాక్టరేట్:

 నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం. జూలై 9

కొత్తగూడెం సాoస్కృతికం :: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి నగర్ శివాలయం ప్రధాన అర్చకులు ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు మద్దిరాల ముక్తేశ్వర రావు కు అమెరికన్ యునైటెడ్ యూనివర్సిటీ పూదుచ్చేరి లోని కంభన్, కలైరంగం ఆడిటరియం లో పౌoడర్ మరియు డైరెక్టర్ కె. వెంకటేశం చేతులమీదుగా డాక్టరేట్ ను ప్రధానం చేశారు. నలుబది సంవత్సరాల అనుభవం కలిగి ఉండి భజన బృందాలను రెండు తెలుగు రాష్ట్రాలలో తయారుచేసి ఆధ్యాత్మికత వైపు నడిపిస్తున్నారని ప్రశంసించారు. ఈయనకు సంగీతంలో 48 గంటలు హార్మోనియం ప్రదర్శన ఇచ్చినందుకు “హార్మోనియం విధ్వన్వమని” బిరుదుతో సత్కరించారు. కాకినాడలో భజన పోటీలలో అద్భుతమైన న్యాయనిర్ణీతగా వ్యవహరించినందుకు కాకినాడ కమిటీ వారు ” స్వర్ణ సింహా కంకణం” బహుకరించి సత్కరించారు “సువర్ణ సింహ తలాట సన్మాన” గ్రహీతగా పేర్కొన్నారు. ఈ సందర్బంగా అమెరికన్ యునైటెడ్ యూనివర్షిటీ బాధ్యులకు ముక్టేశ్వర్ రావు ధన్యవాదములు తేలిపారు. ముక్తేశ్వర్ రావు ను కొత్తగూడెం అర్చకులు, పుర ప్రముఖులు, శివ భక్తులు అభినందించారు