సిర్పూర్ మంజీరలో ఇసుక మాఫియా రాజ్యం..
-చెక్‌పోస్టులను బేఖాతర్ చేస్తున్న అక్రమ రవాణాదారులు -ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి వేల రూపాయల వసూళ్లు (నమస్తే ఇందూర్) జుక్కల్ ఆర్సీ జూలై 10: ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, సిర్పూర్ మంజీర పరివాహక ప్రాంతంలోని డోంగ్లి మండలంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. మంజీరా నది పరివాహక ప్రాంతం నుంచి ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5.30 గంటల వరకు భారీ ఎత్తున ఇసుక తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన...