NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 11:42 am Posted by : MEDUDHULA KASHAGOUD

14వ వార్డులో ఇంటింటా ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ..

-14 వర్డ్ కౌన్సిలర్ హర్షిత

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జులై 10:

కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డులో ప్రత్యేక ఇంటింటా సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ మేరకు బూత్ లెవల్ అధికారులు (బీఏల్ఓలు) ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసి, పూర్తిగా నింపిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.ఈ నెల 24వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో వార్డులోని ప్రతి కుటుంబం తమ వివరాలను సక్రమంగా నమోదు చేసి సంబంధిత పత్రాలను బీఏల్ఓలకు అందజేయాలని అధికారులు కోరారు. ప్రతి ఇంటికి చేరుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, ఎలాంటి కుటుంబం మిగిలిపోకుండా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవసరమైన వివరాలను ఖచ్చితంగా అందించాలని, తద్వారా ప్రభుత్వ రికార్డులు నవీకరణకు ప్రజా సేవల మెరుగైన అమలుకు సహకరించాలని 14 వర్డ్ కౌన్సిలర్ హర్షిత విజ్ఞప్తి చేశారు.