14వ వార్డులో టీపీసీసీ మార్గదర్శకాలపై అవగాహన కార్యక్రమం
-మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 18: కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డులోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అవగాహన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పాల్గొని, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం, సామాజిక బాధ్యత, గాంధేయ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఇకపై...