14వ వార్డ్‌లో వీధి కుక్కల పట్టివేత కాలనీవాసులకు ఊరట
(నమస్తే ఇందూర్) కామారెడ్డి, ప్రతినిధి జూలై 18: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డ్‌లో వీధి కుక్కల సమస్యపై స్థానికుల ఫిర్యాదులకు స్పందించిన మున్సిపల్ అధికారులు శుక్రవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానిక కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత చొరవతో మున్సిపల్ సిబ్బంది వార్డ్‌లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న వీధి కుక్కలను పట్టుకున్నారు.కాకతీయ నగర్, సిద్ధి వినాయక నగర్, ఎన్‌జీవోస్ కాలనీ ప్రాంతాల్లో తిరుగుతున్న కుక్కలను గుర్తించి ప్రత్యేక వాహనాల ద్వారా యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏ.బి.సి.) కేంద్రాలకు తరలించారు. అక్కడ వాటికి కుటుంబ నియంత్రణ...