అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల పిడిఎస్ బియ్యం పట్టివేత..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 14: హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 టన్నుల పిడిఎస్ బియ్యాన్ని పిట్లం పోలీసులు పట్టుకున్నారు. 632 పాలిథిన్‌ కవర్లలో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిట్లం పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బంది వెంకటేష్, రాజేశ్వర్‌లతో కలిసి పిట్లం చౌరస్తా సమీపంలోని ఫ్లైఓవర్‌ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌ వైపు వెళ్తున్న జీజే-25-యు-7022...