అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న విద్యాదాత సుభాష్‌రెడ్డికి ఘన స్వాగతం..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 20: విద్యారంగ అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తున్న విద్యాదాత, ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు 30 రోజులపాటు అమెరికాలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి తెలుగు ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు.అమెరికా పర్యటన అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సుభాష్‌రెడ్డికి అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించి...