NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 1:11 pm Posted by : NAMASTE INDUR

అమ్ధాపూర్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు ఘనంగా

అమ్ధాపూర్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు ఘనంగా

నమస్తే ఇందూర్, నిజామాబాద్ 

బోధన్: బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామంలో ఇందూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బోధన్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టపాకాయలు పేల్చి, కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజా సేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల ప్రధాన కార్యదర్శి జిల్కరి ప్రవీణ్, సీనియర్ నాయకులు నమిళ్ల లింగం, బోనేకర్ కిరణ్, బసప్ప, గాదె సురేందర్, శక్తి కేంద్రం ఇంచార్జి నమిళ్ల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు మహేష్ కులకర్ణి, తోట సురేష్, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, నీరడి బాబురావు, సిర్ప గోపి, నమిళ్ల సాయి, కర్రోళ్ల రమేష్, నమిళ్ల పరుశరామ్, విస్లావత్ శ్రీనివాస్, నమిళ్ల సతీష్, కాలేవార్ కృష్ణ, బూర్ల వినయ్, చింటు గౌడ్, జాదవ్ హన్మాండ్లు, సిర్ప ప్రశాంత్, అనయ్, బోయి శ్రీనివాస్, నాగ్గరి శంకర్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.