అరుదైన రక్త వ్యాధితో బాధపడుతున్న గిరిజన యువతికి పునర్జన్మ
-యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ వైద్యుల విజయవంతమైన చికిత్స (నమస్తే ఇందూర్)కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 11: అత్యంత అరుదైన, ప్రాణాంతక రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన యువతికి హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. అరుదైన త్రోంబోటిక్ త్రోంబోసిటోపెనిక్ పర్పరా ( టి.టీ.పి.) వ్యాధిని సకాలంలో గుర్తించి అత్యవసర చికిత్స అందించడం ద్వారా యువతి ఆరోగ్యాన్ని మెరుగుపరిచినట్లు వైద్యులు తెలిపారు. కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో యశోద హాస్పిటల్స్ వైద్యులు...