ఇందిరమ్మ ఇల్లు అర్హతపై విచారణ.. పరిధిపేటలో డీఎల్పీఓ పరిశీలన
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 05: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరుపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా స్థాయి పంచాయతీ అధికారి (డీఎల్పీఓ) శ్రీనివాస్ బుధవారం గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సంబంధిత స్థలాన్ని పరిశీలించడంతో పాటు, స్థానికుల నుంచి వివరాలు సేకరించి రికార్డులను పరిశీలించారు. ఈ ఘటన ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన గంగయ్యకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు విరుద్ధంగా మంజూరైందని...