ఇస్రోజీవాడిలో వర్షాల నష్టం పరిశీలించిన ఆర్డీవో, ఎంఆర్ఓ
నమస్తే ఇందూర్, కామారెడ్డి, ఆగస్టు 4: భారీ వర్షాల నేపథ్యంలో తాడ్వాయి మండలం ఇస్రోజీవాడి గ్రామాన్ని మంగళవారం ఆర్డీవో, ఎంఆర్ఓ అధికారులు సందర్శించారు. గ్రామ సర్పంచ్ శ్రీ చిందం మల్లేష్‌తో కలిసి ఇస్రోజీవాడి నుంచి గర్గుల్‌కు వెళ్లే మార్గంలో వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు.అనంతరం గ్రామంలో భారీ వర్షాల కారణంగా కూలిపోయిన ఇళ్లను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం...