–జిల్లా వ్యాప్తంగా జంగమలు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకుల పిలుపు
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 06:
జంగము సమాజ ఐక్యత, అభ్యున్నతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు జంగము సమాజ సమావేష కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు శ్రీ శ్రీ శ్రీ పంచాచార్య దిగంబర ఓగ్గుస్టల్, శివార్య మహాస్థలి ఆవరణలో ఈ సమావేశం జరగనుంది.జిల్లా అధ్యక్షుడు, శ్రీ మఠాధిపతులు, వివిధ మండలాల జంగము సమాజ ప్రతినిధులు, పెద్దలు, యువత, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని సమాజ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. సమాజ సంక్షేమం, విద్యా ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక ఐక్యత, దేవాలయాల అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణతో పాటు సమాజాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, వివిధ సంక్షేమ పథకాల అమలులో జంగము సమాజానికి తగిన ప్రాధాన్యం కల్పించేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అలాగే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సమాజాన్ని మరింత సంఘటితం చేయడం, యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు అన్నారు .జిల్లాలోని అన్ని మండలాల జంగము సమాజ సభ్యులు, పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 8074460076, 9848981342, 9440120684 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. సమాజ అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న ఈ సమావేషాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.