NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 5:48 pm Posted by : MEDUDHULA KASHAGOUD

ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
తాడ్వాయి జూలై 31:

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని నందివాడ, చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. దివంగత సింగం వెంకటేశ్వర్‌రావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సింగం హనుమంతరావు ఈ నోటు పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు దామోదర్‌రావు, సింగం హనుమంతరావు, భుజంగం రాము, ప్రధానోపాధ్యాయురాలు మాధురి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.