ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయి జూలై 31: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని నందివాడ, చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. దివంగత సింగం వెంకటేశ్వర్‌రావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సింగం హనుమంతరావు ఈ నోటు పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో...