NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 4:36 pm Posted by : Rayala Polaiah

ఊట్లపల్లి లో. వనమహోత్సవకార్యక్రమం

అశ్వారావుపేట మండలం ఉట్లపల్లిలో ‘వన మహోత్సవ’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జారే

  • నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆగష్టు 25

 

అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వనమహోత్సవ కార్యక్రమం ఓ పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉట్లపల్లి అటవీ శాఖ,ప్రజాప్రతినిధులతో పాటు పలు శాఖల అధికారులు భాగమయ్యారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది భాగస్వామ్యంతో మొక్కల పెంపకం ప్రాముఖ్యతను తెలియజేశారు. గ్రీన్ ఇండియా కలను నెరవేర్చే దిశగా గ్రామ ప్రజలు, స్థానికులు ముందడుగు వేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు మొక్కలు నాటి ‘వన మహోత్సవ’ కార్యక్రమం కు ప్రోత్సాహం కలిగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును అందించే జీవనదాతగా భావించి, పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకున్నంత అపురూపంగా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ S.లక్ష్మి కుమారి రామకృష్ణ గారు,ఆత్మ కమిటీ చైర్మన్ వీరభద్రం గారు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ , ఎంపీవో రామ్ రెడ్డి.జూపల్లి ప్రమోద్, కౌన్సెలర్ హరిబాబు , దివాకర్కో.లా లక్ష్మి నారాయణగారు,కాసాని పద్మ శేఖర్. అడవి శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు…