ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల విజయకేతనం
నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆగష్టు 3
2వ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్‌లో ఘన విజయం
పాల్వంచ: ఆగస్టు 2న నిర్వహించిన 2వ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్లో పాల్వంచ ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి భారత దేశ గౌరవాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపారు.
ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీల్లో ఎక్స్‌ట్రీమ్ విద్యార్థులు 13 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించి మొత్తం 3 గ్రాండ్ ఛాంపియన్‌షిప్‌లు కైవసం చేసుకుని ఘన విజయాన్ని నమోదు చేశారు.
గ్రాండ్ ఛాంపియన్‌షిప్ విజేతలు
క్యాడెట్ విభాగంలో: చిన్నారి దితికశ్రీ
జూనియర్స్ విభాగంలో: మనుశ్రీ
సీనియర్స్ విభాగంలో: హర్షిక
తమ అద్భుతమైన ప్రతిభతో దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో నిలిచి, భారత మాత ముద్దుబిడ్డలుగా ఎనలేని కీర్తి ప్రతిష్ఠలను సాధించిన విద్యార్థులు విజయంతో తిరిగి వస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల విజయంపై గ్రాండ్ మాస్టర్ కోనే సూరిబాబు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ వేదికలపై విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.