ఎర్రపహాడ్‌లో ఘనంగా కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయి ఆగస్టు 14: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్ గ్రామంలో పేద కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మార్గదర్శకంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 7 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను ప్రజాప్రతినిధులు,...