ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన చేసిన పోలీసులు..
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ఆగస్టు 14: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం ధర్మారావుపేట్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసును సదాశివనగర్ పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో నిందితులను గుర్తించి చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు, వారి నుంచి 36 గ్రాముల బంగారు ముక్కుపోగులతో పాటు చోరీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.ధర్మారావుపేట్ ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగులు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రైమ్ నంబర్ 157/2026, బి...