కామారెడ్డి జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం
-జిల్లా సగటు వర్షపాతం 482.7 మి.మీ నమోదు (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 01: కామారెడ్డి, ఆగస్టు 1: తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) విడుదల చేసిన మండలాల వారీ వర్షపాతం నివేదిక ప్రకారం కామారెడ్డి జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 482.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 397.7 మి.మీతో పోలిస్తే 21 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. జిల్లాలోని 25 మండలాల్లో ఒక మండలంలో భారీ అధిక వర్షపాతం (లార్జ్ ఎక్స్), 12 మండలాల్లో అధిక...