కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి..

-జీవీఎస్, డీఎస్‌ఎఫ్‌ఐ నాయకుల డిమాండ్ (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 20: కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీవీఎస్, డీఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జీవీఎస్ జిల్లా అధ్యక్షుడు సభావత్ వినోద్ నాయక్, డీఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా తరగతి గదులు లేకపోవడంతో...