గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్య అందించడమే లక్ష్యం..
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయి ఆగష్టు 15: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలనే ఉద్దేశంతో తాడ్వాయి మండలం సోమారం గ్రామానికి చెందిన కమిశెట్టి సంతోష్ హైదరాబాద్‌కు చెందిన సాంకేత్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ప్రతినిధులు సోమారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రూ.53 వేల విలువైన ప్రొజెక్టర్, స్క్రీన్‌ను అందజేశారు. అలాగే గ్రామంలోని రెండు అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు, విద్యా సామగ్రిని సంస్థ ప్రతినిధులు అందించారు. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు...