ఛాతీ వ్యాధుల శస్త్రచికిత్సలో మినిమల్లీ ఇన్వాసివ్ టెక్నాలజీతో మెరుగైన చికిత్స

-డా.సి.రోహన్ రెడ్డి (నమస్తే ఇందూర్) కామారెడ్డి నిజామాబాద్ ప్రతినిధి ఆగస్టు 05: ఊపిరితిత్తులు, అన్నవాహిక, మీడియాస్టినం (ఛాతీ మధ్య భాగం), డయాఫ్రేమ్, ఛాతీ గోడకు సంబంధించిన వ్యాధుల చికిత్సలో ఆధునిక మినిమల్లీ ఇన్వాసివ్ థొరాసిక్ సర్జరీ ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ సి. రోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ (వి.ఏ.టి.ఎస్.) రోబోటిక్ అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ...