జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 05: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సమాలోచన అధ్యయన కేంద్రం (టాస్క్) జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి నిర్వహించే ఈ పోటీలలో "ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారసత్వం – నేటితరం బాధ్యత" అనే అంశంపై విద్యార్థులు వ్యాసాలు రాయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర,...