జిల్లాలో నెలరోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
-అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలకు నో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు -జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి, జూలై 31: కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు జిల్లా వ్యాప్తంగా భారత పోలీసు చట్టం–1861లోని 30, 30(ఎ) సెక్షన్లు అమలులో ఉంటాయని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా...