ట్రాన్స్‌ఫార్మర్ చోరీ ముఠా గుట్టురట్టు మరో నిందితుడు అరెస్ట్..

-మద్నూర్, జుక్కల్, పెద్దకొడపగల్, బిచ్కుంద, పిట్లం మండలాల్లో వరుస ట్రాన్స్‌ఫార్మర్ చోరీలు -సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు – పనిముట్లు, కత్తి, బైక్, నగదు స్వాధీనం (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ ఆగస్టు 22: కామారెడ్డి జిల్లాలో వరుసగా జరుగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మరో నిందితుడు భీమ్‌రావును అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించి నిందితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి పోలీసులు...