NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 10:48 am Posted by : NAMASTE INDUR

తాడ్వాయి గ్రామంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

తాడ్వాయి గ్రామంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకల

నమస్తే ఇందూర్, తాడ్వాయి ఆగస్టు 28

తాడ్వాయి: సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో తాడ్వాయి గ్రామంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆత్మీయత, సోదరభావం, పరస్పర గౌరవం, సామాజిక ఐక్యతను చాటిచెప్పేలా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విభాగ్ సంయోజక్ సంగన్న గారి బాల్ రాజ్ గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షులు తుమ్మ రామ్ చంద్రం పాల్గొన్నారు. రక్షాబంధన్ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ, రక్షాబంధన్ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాత్రమే పరిమితమైన పండుగ కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర విశ్వాసం, సోదరభావాన్ని పెంపొందించే గొప్ప సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “మనమంతా బంధువులం. సోదరభావంతో కలిసి మెలిసి జీవిద్దాం. సమాజంలో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా పరస్పర గౌరవం, ప్రేమ, ఆత్మీయతతో ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు. రక్షాబంధన్ స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పరస్పరం అండగా నిలిచి, సామాజిక సమరసతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.సమాజంలో ప్రతి వ్యక్తి పట్ల ఆత్మీయత, గౌరవం కలిగి ఉండటం ద్వారా పరస్పర సహకారం, సోదరభావం పెరుగుతాయని, తద్వారా బలమైన మరియు సమరసతతో కూడిన సమాజ నిర్మాణానికి మార్గం సుగమమవుతుందని వారు అన్నారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ రాములు, మాజీ సర్పంచ్ మండల అద్యక్షుల కాంగ్రెస్ పార్టీ సంజీవ్, మాజీ ఏం పి టి సి స్వరూప బాల్ రాజ్,అంబేద్కర్ సంఘం అద్యక్షులు, కృష్ణమూర్తి, సాయిలు, నారాయణ, భూపాల్, సంగీ రాజేందర్ తదితరులతో పాటు సామాజిక సమరసత సభ్యులు, గ్రామ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.